ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఏజెన్సీలో కరోనా నియంత్రణకు చర్యలు' - తూర్పుగోదావరి జిల్లా వార్తలు

ఏజెన్సీలో కరోనా నియంత్రణకు అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టాలని రంపచోడవరం ఐటీడీఏ ఇంచార్జి ప్రాజెక్టు అధికారి, సబ్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

east godavari district
ఏజెన్సీలో కరోనా నియంత్రణకు చర్యలు:

By

Published : Jul 25, 2020, 11:58 PM IST

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయంలో ఐటీడీఏ ఇంచార్జి ప్రాజెక్టు అధికారి, సబ్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏజెన్సీలో కరోనా నియంత్రణకు అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఏజెన్సీలో కరోనా రోజురోజుకు పెరుగుతుందని.. దీని నివారణకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు.

ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించి శానిటైజర్లు వినియోగించాలన్నారు. స్థానిక లెనోరా విద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కొవిడ్ ఆస్పత్రికి డాక్టర్ రాజ్ కుమార్, ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కార్తీక్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కరోనా సోకితే ప్రత్యేక వైద్య సేవలను అందించాలని ఆదేశించారు ఈ సమీక్షలో ఐటీడీఏ ఏపిఓ నాయుడు, హెల్త్ మోనిటరింగ్ సెల్ ఇన్చార్జి డాక్టర్ పాపారావు, డీఎల్పీఓ హరినాద్ బాబు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండిఆటల్లేవ్... పోటీల్లేవ్..కనీసం కసరత్తులూ లేవ్…

ABOUT THE AUTHOR

...view details