తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మన్యంలో మేడే పుష్పాలు ఆకట్టుకుంటున్నాయి. రాజవొమ్మంగి మండలం జడ్డంగిలో వెల్లిశెట్టి వెంకటేశ్వర్లు, గంగవరంలో రఘుపతి ఇళ్లలోని పెరట్లో ఉన్న ఈ పుష్పాలు అందరినీ కనువిందు చేస్తున్నాయి.
ఇవి మే నెలలో మాత్రమే వికసించే పుష్పాలు. కొద్దిరోజులు మాత్రమే ఉంటాయి. స్కాడక్స్ అనే శాస్త్రీయ నామంతో పిలవబడే ఈ పుష్పం ఆఫ్రికాకు చెందినదని ఉద్యాన అధికారి దివ్య తెలిపారు. బ్లడ్ లిల్లీ, ఫైర్ బాల్ లిల్లీ అని కూడా పేర్లున్నట్టు చెప్పారు.