తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామంలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. లొల్ల గ్రామానికి చెందిన దూలం ఏకాంబిక (22)కు.. కొత్తపేట మండలం మోడేకుర్రుకు చెందిన దుర్గాప్రసాద్‌తో 11 నెలల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం ఏకాంబిక 4 నెలల గర్భిణి.
పుట్టింటికి వచ్చిన ఏకాంబిక... లాక్డౌన్ కారణంగా ఇక్కడే ఉంటోంది. ఇటీవల భర్త వేధింపుల కారణంగానే ఇప్పుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఘటనా ప్రాంతాన్ని అమలాపురం డీఎస్పీ మసూం భాష, రావులపాలెం సీఐ వి.కృష్ణలు పరిశీలించి కేసు నమోదు చేశారు.