ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాసేపట్లో పెళ్లి... ఇంతలో 'పాజిటివ్' అంటూ సందేశం - కరోనాతో వివాహం వాయిదా వార్తలు

శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమ్మాయి, అబ్బాయి తరఫు బంధువులతో ఆ ప్రాంతం సందడిగా మారింది. అయితే ఇంతలో ఒక్కసారిగా కరోనా కలకలం రేగింది. వరుడికి పాజిటివ్ అంటూ ఫోన్​కు సందేశం వచ్చింది.

marriage was called off by Corona in east godavari district
marriage was called off by Corona in east godavari district

By

Published : Jul 23, 2020, 5:56 PM IST

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో పెళ్లింట కరోనా కలకలం రేపింది. పెళ్లి కుమారుడికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావటంతో పెళ్లి తంతును వాయిదా వేశారు. జ్వరం రావటంతో అనుమానంతో కరోనా పరీక్ష చేయించుకున్న ఓ వ్యక్తి... ఫలితాలు రాకముందే పెళ్లికి సిద్ధమయ్యాడు. ముహూర్త సమయం సమీస్తుండగా పెళ్లికొడుకును చేసే సమయంలో అతని ఫోన్‌కు కరోనా పాజిటివ్‌ అని సందేశం వచ్చింది.

ఇంకేముంది పెళ్లికొడుకును క్వారంటైన్‌కు తరలించి..వివాహాన్ని వాయిదా వేశారు. అప్పటివరకూ పెళ్లి వేడుకలో పాల్గొన్న వారంతా భయాందోళనలతో పరీక్షలు చేయించుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details