తూర్పు గోదావరి జిల్లాలో పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది. అద్దిరిపేట వద్ద బోర్‌వెల్ లారీలో తరలిస్తున్న రూ.2 కోట్లు విలువ చేసే వెయ్యి కిలోల గంజాయిని తుని పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని రవాణా చేస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ రవీంద్రబాబు తెలిపారు. నిందితులకు గతంలోనూ గంజాయి రవాణాతో సంబంధాలు ఉన్నాయని చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
Marijuana: బోర్‌వెల్ లారీలో రూ.2 కోట్ల విలువైన గంజాయి పట్టివేత - ఏపీ అప్డేట్స్

Marijuana seizure
13:39 October 03
లారీలో వెయ్యి కిలోల గంజాయి పట్టివేత
బోర్‌వెల్ లారీలో రూ.2 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
"గంజాయిని రవాణా చేస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నాం. నిందితులకు గతంలోనూ గంజాయి రవాణాతో సంబంధాలు ఉన్నాయి."
-రవీంద్రబాబు, ఎస్పీ
Last Updated : Oct 3, 2021, 4:35 PM IST