తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో ఉన్న మార్చురీలో శవాలను భద్రపరిచే ఫ్రీజర్లు పనిచేయక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నెలరోజులుగా ఇవి పనిచేయడం లేదు. ముఖ్యంగా తుని రైల్వే స్టేషన్ పరిధిలో తరచూ ప్రమాదాల్లో చనిపోతున్న వారిలో గుర్తుతెలియని వ్యక్తులు ఎక్కువగా ఉంటున్నారు.
వారి సమాచారం సేకరించి బంధువులకు అప్పగించడానికి కనీసం 4 నుంచి 5 రోజుల సమయం పడుతుంది. ఈ క్రమంలో ఫ్రీజర్లు పనిచేయని కారణంగా... మృతదేహాలను భద్రపరచలేకపోతున్నారు. ఈ సమస్యపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బంది కోరుతున్నారు.