తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం 11 మండలాల్లోని మన్యంలో గిరిజనులు బంద్ పాటించారు. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. స్థానిక అంబేద్కర్ సెంటర్లో గిరిజన సంఘం నాయకులు బైఠాయించారు. అల్లర్లు జరగకుండా పోలీసులు పటిష్ఠమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
మన్యంలో ప్రశాంతంగా బంద్ - tribals reservations in jobs
ఏజెన్సీ ప్రాంతంలో వంద శాతం ఉద్యోగాలు గిరిజనులకే ఇవ్వాలన్న జీవో నెం.3ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ మన్యంలో బంద్ పాటించారు.
గిరిజనులకు ప్రయోజనం చేకూర్చే జీవో నెంబర్ 3ను పటిష్ఠంగా అమలు చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర నాయకురాలు మట్ల వాణిశ్రీ డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 3 ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో వంద శాతం ఉద్యోగాలు గిరిజనులకే కల్పించాలన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు 50 శాతం గిరిజనులకు, 50 శాతం గిరిజనేతరులకు కేటాయిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో కోర్టు తీర్పును తప్పుబడుతూ గిరిజన సంఘం ఆధ్వర్యంలో బంద్ ప్రకటించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు డేగల శ్రీను, బాపన్న దొర, సత్యనారాయణ దొర, చెళ్లాయమ్మ తదితరులు పాల్గొన్నారు.