ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇది పురుగు అనుకుంటున్నారా.. కాదు కాంతులు వెదజల్లే రొయ్య

By

Published : Jun 28, 2021, 7:35 AM IST

ఇది చూడటానికి అచ్చం పురుగులాగానే కనిపిస్తోంది కదా! అలా అనుకుంటే పొరపాటే మరి. అంతర్జాతీయ మార్కెట్​లో మంచి డిమాండ్ ఉన్న రొయ్య. దీనిపేరు మాంటీస్‌ ష్రింపు (మాంటీస్‌ రొయ్య)..దీని కళ్లనుంచి కాంతులు వస్తాయి. ఇది అరుదుగా దొరుకుంతదని స్థానికులు చెప్తున్నారు.

mantis shrimp at antharvedi
మాంటీస్‌ రొయ్య

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది మినీ హార్బర్‌లో ఆదివారం 510 గ్రాముల బరువున్న మాంటీస్‌ ష్రింపు(మాంటీస్‌ రొయ్య) అబ్బురపరిచింది. స్థానిక మత్స్యకారుల వలకు చిక్కిన ఈ రొయ్య.. ఒకప్పుడు విరివిగా లభించినా, ప్రస్తుతం అరుదుగా దొరుకుతుందని, ఇది తేలు మాదిరిగా ఉంటుందని స్థానికులు తెలిపారు. ఈ రొయ్యకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి ధర ఉంటుందని, ఈ రొయ్య కళ్లనుంచి కాంతులు వెదజల్లుతుందని మత్స్యశాఖ ఏడీ కృష్ణారావు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details