తూర్పు గోదావరి జిల్లా ఐ. పోలవరం మండలంలో రెండు వేల కుటుంబాలు నివసించే లంక గ్రామం గోగుల్లంక. వీరి ప్రధాన జీవనాధారం మెట్ట వ్యవసాయం, కొబ్బరితోటలు. సముద్రానికి చేరువలోనే ఉన్న ఈ గ్రామానికి రక్షణ కవచం మడ అడవులే. గతంలో ప్రకృతి విపత్తుతో వచ్చిన అనేక వరదలు, తుపానులు, ఉప్పెనల నుంచి వీటి కారణంగానే.. ఈ లంక గ్రామం సురక్షితంగా ఉంది. ఇప్పుడు స్థానికంగా ఉండే కొంతమంది మత్స్యకారులు మడ అడవులను తొలగించి చెరువులు తవ్వుతున్నారు. ఫలితంగా.. భవిష్యత్తులో లంక గ్రామం కనుమరుగయ్యే పరిస్థితి ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలే ఈ పని చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
మడ అడవులు నరికి చెరువులు తవ్వేస్తున్నారు - east godavri district latest news
తూర్పుగోదావరి జిల్లాలోని లంక గ్రామమైన గోగుల్లంకలో కొంతమంది మత్స్యకారులు మడ అడవులను నరికేసి... చెరువులు తవ్వేస్తున్నారు.
చెరువులుగా మారుతున్న మడ అడవులు