తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని గూడపల్లి గ్రామంలో పండే మామిడి పండ్ల కోసం ప్రజలు దూరప్రాంతాల నుంచి వస్తుంటారు. జూన్ మొదటి వారం నుంచి చివరి వరకూ వివిధ రకాల మామిడి పండ్లు ఇక్కడ లభిస్తాయి. బంగినపల్లి, చెరుకు రసాలు, దేశవాళి రసాలు ఇలా వివిధ రకాల పేర్లతో ఇక్కడ లభించే మామిడి పండ్ల కోసం అనేక ప్రాంతాలకు చెందినవారు వస్తారు. ఈ పండ్లకు రుచి ఎక్కువ ఉంటుందని రైతులు తెలిపారు.
గూడపల్లిలో మామిడి పండ్ల విక్రయాలు ప్రారంభం - తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ప్రారంభమైన మామిడిపళ్ల అమ్మకాలు
మామిడిపండ్లకు తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ఫేమస్.. అందులోనూ గూడపల్లి గ్రామంలో పండే మామిడి పండ్లకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.. జూన్ మొదటివారంలో ప్రారంభమై నెలాఖరు వరకూ అమ్మకాలు జరుగుతాయి.. ఈ పండ్లకోసం ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వస్తుంటారని స్థానికులు అంటున్నారు.

mangos selling started in east godavari dst konasima gudapalli