ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'మన పండితులు హిందుత్వాన్ని నలుదిశలా చాటిచెపుతున్నారు'

పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం మండపాక గ్రామంలో రామాలయ పునర్మిర్మాణం కార్యక్రమంలో శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామిజీ పాల్గొన్నారు.

By

Published : Feb 26, 2020, 12:19 PM IST

Published : Feb 26, 2020, 12:19 PM IST

mandapaka-ramalayam-reconstruction-program
రామాలయ పునర్మిర్మాణం కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామిజీ

భారతదేశం వేదాలకు పుట్టినిల్లని ఉభయగోదావరి జిల్లాలోని వేదపండితులు, స్మార్త పండితులు హిందుత్వాన్ని నలుదిశలా చాటిచెపుతున్నారని శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామిజీ అన్నారు. పశ్చిమగోదావరిజిల్లా తణుకు మండలం మండపాక గ్రామంలో రామాలయ పునర్నిర్మాణం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఎన్ని దేవాలయాలున్నా వైకుంఠపురంలో ఉండే దేవదేవుని భూలోకంలో తమ కళ్ల ముందు ప్రతిష్టించుకోవాలన్న మానవుని ప్రయత్నాలు అభినందనీయమన్నారు. ఏ దేవాలయంలో అయినా ఒక్కరే దేవుని ప్రతిష్టిస్తారని, రామాలయంలో మాత్రమే రామ లక్ష్మణ సీతాదేవిలతోపాటు ఆంజనేయుని విగ్రహాన్ని ప్రతిష్టిస్తారని చెప్పారు. ఈకార్యక్రమంలో స్వామీజీని తణుకు శాసనసభ్యుడు కారుమూరి వెంకట నాగేశ్వరరావు సత్కరించారు.

రామాలయ పునర్మిర్మాణం కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామిజీ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details