తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం దేవరపల్లికి చెందిన దిడ్ల బాపన్న భార్య.. జీవనోపాధి కోసం కువైట్లో నివసిస్తోంది. గత కొన్ని రోజులుగా భర్తకు ఫోన్ చేసి అక్కడి పరిస్థితులను వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. భార్య ఇబ్బందులు పడటాన్ని భరించలేక బాపన్న తీవ్ర మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్స నిమిత్తం స్థానికులు.. బాధితుడిని కొత్తపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
భార్య ఇబ్బందుల్లో ఉందని మనస్తాపంతో భర్త ఆత్మహత్య - రావులపాలెం నేర వార్తలు
తప్పనిసరి పరిస్థితుల్లో ఉపాధి కోసం విదేశానికి వెళ్లింది భార్య. స్వదేశంలోనే ఉంటూ.. పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు భర్త. ఆనందంగా సాగిపోతున్న వారి జీవితంలో కరోనా రక్కసి ఆశనిపాతంలా మారింది. కొవిడ్ లాక్డౌన్ కారణంగా విదేశంలో చిక్కుకున్న భార్య ఇబ్బందులను పడటాన్ని జీర్ణించుకోలేక.. మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జరిగింది.
![భార్య ఇబ్బందుల్లో ఉందని మనస్తాపంతో భర్త ఆత్మహత్య man-suicide-with-mentally-depression-in-ravulalpaem eastgodavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7989330-978-7989330-1594483027531.jpg)
భార్య ఇబ్బందుల్లో ఉందని మనస్తాపంతో భర్త ఆత్మహత్య