ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Suicide: తుని​లో ఘోరం.. అందరూ చూస్తుండగానే రైలుకింద పడి యువకుడి ఆత్మహత్య - ap latest news

Suicide: తూర్పు గోదావరి జిల్లా తుని రైల్వే స్టేషన్​లో ఘోరం జరిగింది. వేగంగా వెళ్తున్న రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పటివరకు ఫారంపై వేచి ఉన్న యువకుడు.. రైలు వస్తుండగా స్పీడ్​గా వెళ్లి దానికింద పడ్డాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.

man suicide in tuni railway station in east godavari
తుని రైల్వే స్టేషన్​లో ట్రైన్ కింద పడి యువకుడు ఆత్మహత్య

By

Published : Mar 13, 2022, 9:10 AM IST

Updated : Mar 13, 2022, 10:21 AM IST

తుని రైల్వే స్టేషన్​లో ట్రైన్ కింద పడి యువకుడు ఆత్మహత్య

Suicide: ఆ యువకుడికి ఏ కష్టం వచ్చిందో ఏమో ప్రయాణికులు చూస్తుండగానే ఆత్మహత్యకు పాల్పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వే స్టేషన్‌లో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని యువకుడు (25) తునిలో హాల్టులేని నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు కింద పడి బలవన్మరణం చెందడం చూపరులను తీవ్రంగా కలచివేసింది. ఈ సంఘట దృశ్యాలు రైల్వే స్టేషన్‌లోని 1వ నంబరు ప్లాట్‌ఫాంపై ఉన్న సీసీ కెమెరాలో నమోదయ్యాయి.

అంతవరకు ప్లాట్‌ఫాంపై అటుఇటు తిరుగుతూ ఉన్న అతడు రైలు రాకను గమనించి పట్టాలపైకి దిగి, ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని రైలుకింద పడిపోయారు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ యువకుడు రాత్రి నుంచి స్టేషన్‌ పరిసరాల్లోనే తిరుగుతున్నట్లు స్థానికుల ద్వారా తెలిసిందని, మృతుడి దగ్గర ఎలాంటి ఆధారాలూ లభించలేదని పోలీసులు చెప్పారు.

Last Updated : Mar 13, 2022, 10:21 AM IST

ABOUT THE AUTHOR

...view details