ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చావు కోసం గోదారిలో దూకిన వ్యక్తి... బతకమని ఒడ్డుకు చేర్చి వరద - గోదావరిలో దూకిన యువకుడు

భూమ్మీద నూకలున్నాయంటే.. పులి నోట్లో నోరు పెట్టినా బతికి బయటపడొచ్చనేదినానుడి. సరిగ్గా అటువంటి సంఘటనే కేంద్ర పాలిత యానంలో జరిగింది. వడివడిగా సముద్రంలోకి ప్రవహిస్తున్న గోదావరిలోకి వంతెనపై నుంచి దూకిన వ్యక్తిని వరద ప్రవాహం ఒడ్డున పడేసింది.

man-suicide
man-suicide

By

Published : Aug 27, 2020, 6:28 PM IST

తూర్పుగోదావరి జిల్లా ఐ పోలవరం మండలం యానం ఎదురులంక వారధి వద్ద గడిచిన రెండు రోజుల్లో ఆరు ఆత్మహత్య సంఘటనలు చోటుచేసుకున్నాయి. అమలాపురం, రామచంద్రాపురానికి చెందిన ఇద్దరు, యానంకు చెందిన మరో ఇద్దరు, గుర్తు తెలియని మరో వ్యక్తి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వీరి కోసం పోలీసులు వంతెన పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపడుతున్నారు.

ఇంతలో ముమ్మిడివరంకు చెందిన ఓ వ్యక్తి వంతెనపై నుంచి గోదావరిలో దూకేశాడు. అక్కడే ఉన్న సిబ్బంది పోలీసులు చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. వెంటనే అప్రమత్తమయ్యేలోగా వరద నీటి ప్రవాహం.. ఆ వ్యక్తిని ఒడ్డు వైపునకు నెట్డేసింది. ఈ సంఘటనతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

వ్యక్తిగత అనారోగ్య సమస్యలు.. కరోనా సోకిందనే భయం.. ఆర్థిక ఇబ్బందులు.. కుటుంబ కలహాలతో వీరంతా ఆత్మహత్యలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. బతికిన వ్యక్తి కుటుంబ సమస్యలతో ఈ పని చేసినట్లు పోలీసులకు వివరించాడు. కౌన్సిలింగ్ ఇచ్చి వారి బంధువులకు అప్పగించారు.

ఇదీ చదవండి:మూడు రాజధానుల కేసులపై ఇకపై రోజువారీ విచారణ!

ABOUT THE AUTHOR

...view details