ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉపాధి లేక.. ఉసురు తీసుకున్నాడు! - తూర్ప గోదావరి జిల్లాలో వ్యక్తి ఆత్మహత్య

లాక్ డౌన్ నేపథ్యంలో ఎలాంటి పనులు లేకపోవడం వల్ల మనస్థాపానికి గురైన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో వరిచేలకు వేసే గుళికలను మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

man suicideman suicide at east godavari
ఆత్మహత్యకు పాల్పడ్డ వరప్రసాద్​

By

Published : May 11, 2020, 2:34 PM IST

తూర్పు గోదావరి జిల్లా గోపాలపురానికి చెందిన గంధం వరప్రసాద్.. రోజు కూలీగా పని చేస్తూ జీవించేవాడు. లాక్​డౌన్​ కారణంగా 45 రోజులుగా ఎలాంటి పనులు లేక మనస్థాపానికి గురైనట్టు కుటుంబీకులు చెప్పారు.

వరిచేలకు వేసే గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని... గమనించిన వెంటే ఆసుపత్రికి తరలించినా కాపాడుకోలేకపోయామని ఆవేదన చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై బుజ్జి బాబు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details