తూర్పు గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఎటపాక మండలం గోగుబాకలో చేతబడి చేస్తున్నాడన్న నెపంతో రత్తయ్యను ఆయన తమ్ముడి కుమారులే హత్య చేశారు. రత్తయ్య మృతదేహాన్ని ఇసుకలో పూడ్చిపెట్టారు.
చేతబడి నెపంతో హత్యచేసి.. ఇసుకలో పూడ్చివేసి - తూర్పు గోదావరి నేర వార్తలు
చేతబడి చేస్తున్నాడన్న నెపంతో ఓ వ్యక్తిని అతని సోదరుడి కుమారుడే హత్య చేశారు. ఇసుకలో పూడ్చి పెట్టారు. బంధువుల ఫిర్యాదుతో అసలు విషయం బయటపడింది. తామే హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో నిందితులు ఒప్పుకున్నారు.
![చేతబడి నెపంతో హత్యచేసి.. ఇసుకలో పూడ్చివేసి murder](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10965257-339-10965257-1615461436344.jpg)
చేతబడి నెపంతో హత్యచేసి.. ఇసుకలో పూడ్చివేసి
ఈనెల 5న రత్తయ్య అదృశ్యమవగా బంధువులు ఎటపాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. రత్తయ్యను తామే హత్య చేసినట్లు నిందితులు ప్రసాద్, సత్యనారాయణ ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని నిందితులతో వెలికితీయించారు.
ఇదీ చదవండి:'జైలు అధికారుల నిర్లక్ష్యం వల్లే బెయిల్పై విడుదలైన వ్యక్తి మృతి'