కంచిబొట్ల నాగ సాయి అలియాస్ సాయి వెంకటేష్(25), సాయి పవన్ చిన్నప్పటి నుంచే అనాథలు. ఎక్కడో కలిసిన వారిద్దరి మధ్య స్నేహం చిగురించింది. ఒకరికొకరు సాయంగా ఉంటా.. సొంత అన్నాతమ్మళ్లలా మెలిగారు. కలిసే పౌరోహిత్యం నేర్చుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు కోలమూరులో నివాసముంటూ జీవనం సాగిస్తున్నారు. స్థానిక గుడిలో అర్చకులుగా ఉంటూనే పౌరోహిత్యం చేస్తున్నారు. గతకొంతకాలంగా పవన్‌కు స్నేహితులు ఎక్కువయ్యారు. వారితోనే తిరుగుతూ.. డబ్బు వృథా చేస్తున్నాడు.
స్నేహితుడిని మార్చాలని తరచూ మంచిమాటలు..
చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడితే ఆ స్థాయికి వచ్చారో వారిద్దరికీ బాగా తెలుసు. అయినప్పటికీ చెడుసావాసాలతో పవన్ జీవితాన్ని నాశనం చేసుకోవడం సాయి వెంకటేశ్ జీర్ణించుకోలేకపోయాడు. తన సొంత సోదరుడిగా భావించి... వారితో తిరగొద్దని చెప్పేవాడు. అయినా పవన్ పట్టించుకోకుండా మరింత ఎక్కువ చేశాడు. చెప్తే వినకపోయినప్పటికీ.. పవన్ కచ్చితంగా మారతాడనే ఉద్దేశంతో తరచూ మందలిస్తూ వచ్చాడు. దీంతో పవన్‌కు సాయి వెంకటేశ్‌పై కోపం ఎక్కవైంది. ప్రతిరోజూ ఇంట్లోకి రాగానే... తన స్నేహితుడు చెప్పే మంచి మాటలు సోదిలా అనిపించింది. ఇక నేను తట్టుకోలేనని భావించి ఓ పథకం పన్నాడు.
ఇంట్లోనే మృతదేహాన్ని కాల్చారు..