తూర్పు గోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రాజానగరం మండలం భూపాలపట్నం వద్ద చెరువులో ఓ యుకుడిని తల నరికి గోనె సంచిలో కట్టి పడేసారు. చెరువులో పడేసిన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడు రాజమహేంద్రవరంలోని శాంతినగర్‌కు చెందిన దుర్గాప్రసాద్‌గా గుర్తించారు.
దారుణం..యువకుడి తల నరికి చెరువులో పడేసిన దుండగులు - బొమ్మూరు పోలీస్ స్టేషన్ తాజా వార్తలు
ఓ యువకుడి తల నరికి.. మృతదేహాన్ని చెరువులో పడేసిన ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం భూపాలపట్నంలో జరిగింది. చెరువులో పడేసిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. రాజమహేంద్రవరంలోని శాంతినగర్‌కు చెందిన దుర్గాప్రసాద్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
![దారుణం..యువకుడి తల నరికి చెరువులో పడేసిన దుండగులు man murdered brutally at bhupalapatnam body recovered](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10048605-1014-10048605-1609247456008.jpg)
యువకుడి మృతదేహం
ఈ నెల 15న తన కుమారుడు అదృశ్యమైనట్టు దుర్గాప్రసాద్ తండ్రి బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. యువకుడు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఎవరు హతమార్చారనే విషయంపై రాజానగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: పోస్టుల వివాదం.. తెదేపా నేత దారుణ హత్య