ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

POLICE RESCUE: గోదావరిలో దూకిన యువకుడు.. కాపాడిన పోలీసులు - east godavari district news

గోదావరిలో మునిగిపోతున్న ఓ నిండు ప్రాణాన్ని.. తమ ప్రాణాలకు తెగించి కాపాడారు తూర్పుగోదావరి పోలీసులు. భారీ వర్షంలోనూ తమ బాధ్యతను విస్మరించకుండా మానవత్వాన్ని చాటుకున్నారు.

POLICE RESCUE
గోదావరిలో దూకిన యువకుడిని కాపాడిన పోలీసులు

By

Published : Jul 13, 2021, 6:10 PM IST


తూర్పు గోదావరి జిల్లా రంగంపేటకు చెందిన కోటిపల్లి నవీన్ ద్విచక్రవాహనంపై రావులపాలెం నుంచి జొన్నాడ వైపు ప్రయాణిస్తూ.. గౌతమి పాత బ్రిడ్జిపై నుంచి గోదారిలో దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. అకస్మాత్తుగా యువకుడు గోదావరిలో దూకడాన్ని చూసిన ఆలమూరు హైవే పోలీస్ పెట్రోలింగ్ వెంటనే స్పందించారు.

పైలెట్ జీవీవీఎస్ మూర్తి, హెచ్​సీ ఆర్ఎస్వీ రాజులు గోదారి గట్టుకు చేరుకుని నావపై వరద ఉద్ధృతిలో మునిగిపోతున్న నవీన్​ను కాపాడారు. ఈ ఘటనను అటుగా వెళుతున్న ప్రయాణికులు ఉత్కంఠగా పరిశీలించారు. సదరు యువకుడు విశాఖ డెయిరీలో పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details