ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుత్ షాక్​తో వ్యక్తి మృతి..ధర్నాకు దిగిన బంధువులు - ముమ్మిడివరం షాక్​తో వ్యక్తి మరణం

విద్యుత్ స్తంభంపై ముగ్గురు వ్యక్తులు పని చేస్తూ ఒకరు మృతి చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా ముమ్ముడివరం మండల పరిధిలో జరిగింది.

eastgodavari district
eastgodavari district

By

Published : Aug 2, 2020, 7:50 PM IST

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామంలో విద్యుత్ షాక్​తో ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామంలోని విద్యుత్ స్తంభంపై ముగ్గురు ప్రైవేటు కార్మికులు పని చేస్తుండగా...ఒక్కసారిగా కరెంట్ రావటంతో నాగేంద్ర(22)అనే యువకుడు షాక్​కు గురయ్యాడు. మిగతా ఇద్దరూ పై నుంచి దూకడంతో గాయాలతో బయటపడ్డారు. లైన్​మెన్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని మృతుని బంధువులు ఆరోపించారు. ముమ్మిడివరం జాతీయ రహదారిపై ఉన్న విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు...బంధువులతో చర్చలు జరిపారు.

ABOUT THE AUTHOR

...view details