మంటల్లో చిక్కుకుని వృద్ధుడి సజీవ దహనం - old man dies due to fire accident
తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం కొత్తపల్లి గ్రామంలో రాజులు అనే వృద్ధుడు సజీవ దహనమయ్యాడు. విద్యుదాఘాతంతో రాజులు ఇంట్లో మంటలు చెలరేగాయి. ఇంట్లో ఒంటరిగా నిద్రపోతున్న రాజులు బయటకు రాలేక.. మంటల్లోనే చిక్కుకున్నాడు. అర్ధరాత్రి కావడంతో గ్రామస్థులు అతన్ని కాపాడలేకపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మంటల్లో చిక్కుకుని వృద్ధుడి సజీవదహనం