ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రమాదవశాత్తు కాలు జారాడు.. ప్రాణం కోల్పోయాడు - గోదావరిలో పడి వ్యక్తి మృతి తాజా వార్తలు

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ప్రోత్సాహాలు అందిస్తూ.. 50 శాతం రాయితీతో ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి అధికారులతో పర్యవేక్షణ చేయించి నూటికి నూరు శాతం బహిరంగ మల విసర్జన లేకుండా చేశామని ప్రకటించాయి. అయినా గ్రామాల్లో బహిరంగ మల విసర్జనలు కొనసాగుతూనే ఉంది. ఫలితంగా జనం ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది.

గోదావరిలో కాలు జారింది.. ప్రాణం పోయింది
గోదావరిలో కాలు జారింది.. ప్రాణం పోయింది

By

Published : Nov 14, 2020, 4:04 PM IST

Updated : Nov 14, 2020, 4:16 PM IST

తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని 4 మండలాల్లో 90 శాతం ప్రజలకు వ్యక్తిగత మరుగుదొడ్లు ఉన్నప్పటికీ మలమూత్ర విసర్జనకు ఆరు బయట, పంట కాలువలు, గోదావరి నది పాయలు చెంతకే వెళ్తుంటారు. ఈ క్రమంలో కాలుజారి కాలువలోనూ.. గోదావరిలోనూ పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇందులో మహిళలు కూడా ఉండటం తీవ్ర విచారకరం.

కాలు జారి గోదావరిలోకి..

ముమ్మిడివరం మండలం గురజాపు లంక గ్రామానికి చెందిన 55 ఏళ్ల మోహన్ రావు ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు గోదావరి ఒడ్డుకి వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి గోదావరిలో పడి ప్రాణం కోల్పోయాడు.

కేసు నమోదు..

స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని బయటకు తీసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో వ్యక్తిగత మరుగు దొడ్లు ఉన్నా దీపావళి పండగ ముంగిట నిర్లక్ష్యం కారణంగానే కుటుంబ యజమాని అకాల మరణంతో ఆ ఇంట విషాదం అలుముకుంది.

కఠిన చర్యలు తీసుకోవాలి..

పంట కాల్వలకు, గోదావరి ఒడ్డుకు బహిరంగ మల విసర్జనకు వెళ్లకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

ఇవీ చూడండి : నేర చక్రం తిప్పుతున్న క్రైం పార్టీ కానిస్టేబుళ్లు..!

Last Updated : Nov 14, 2020, 4:16 PM IST

ABOUT THE AUTHOR

...view details