ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏలేశ్వరం క్వారీ వద్ద.. ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య - eleswaram crime news

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం క్వారీ ప్రాంతంలో ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.

man died at eleswaram
man died at eleswaram

By

Published : May 19, 2021, 12:46 PM IST

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం క్వారీ ప్రాంతంలో ఓ వ్యక్తి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. చైతన్య కాలనీకి చెందిన గెద్దాడ శివ అనే వ్యక్తి క్వారీ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు.

నిన్న సాయంత్రం స్థానికులు గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. అతని మృత దేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. మృతునికి ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details