కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు ఆసుపత్రికి వచ్చి వ్యక్తి మృతిచెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలో జరిగింది. కొత్తపేట మండలం వాడపాలెంకు చెందిన నక్కా సత్తయ్య అనారోగ్యానికి గురయ్యాడు. ఈ క్రమంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు వానపల్లి పీహెచ్‌సీ వద్దకు గురువారం వచ్చాడు. పరీక్షకు సమయం పడుతుందని ఆసుపత్రి సిబ్బంది తెలపగా... అతను అక్కడి నుంచి బయటకు వచ్చాడు. స్థానిక చేపల మార్కెట్ సమీపం వద్దకు రాగానే కుప్పకూలి పడిపోయాడు. వైద్య సిబ్బంది వచ్చి చూసేలోపు మృతి చెందాడు.
కరోనా పరీక్షలకు వచ్చి వ్యక్తి మృతి - kottapeta mandal latest news
కరోనా పరీక్షలకు ఆసుపత్రికి వచ్చిన వ్యక్తి మృతి చెందాడు. ఈ హృదయ విదారక ఘటన తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలో జరిగింది. ఆసుపత్రికి సమీపంలో ఒక్కసారిగా కుప్పకూలిన అతను... అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
man died at hospital who came for corona tests in east godavari district