ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆలయంలో త్రిశూలాన్ని ధ్వంసం చేసిన నిందితుడి అరెస్ట్ - police caught accused with cc tv potage

తూర్పుగోదావరి జిల్లా కొండయ్యపాలెంలోని శ్రీ నూకాలమ్మ దేవాలయంలో త్రిశూలాన్ని ధ్వంసం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా అతడిని గుర్తించారు. మద్యం మత్తులో ఘటనకు పాల్పడినట్టు విచారణలో తేలినట్టు పోలీసులు తెలిపారు.

accused destroyed gods idle arrested
ఆలయంలో త్రిశూలాలు ధ్వంసం చేసిన నిందితుడి అరెస్ట్

By

Published : Jan 18, 2021, 9:30 PM IST

అమ్మవారి త్రిశూలాన్ని ధ్వంసం చేస్తున్న నిందితుడు

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని కొండయ్యపాలెంలోని శ్రీ నూకాలమ్మ ఆలయంలో త్రిశూలాన్ని విరగొట్టిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ఘటనకు ముందు రాత్రి సమయంలో ఒక వ్యక్తి వాటిని ధ్వంసం చేసినట్లు గుర్తించారు.

కొండయ్యపాలెం పాత రైల్వే గేట్ వీధికి చెందిన వనుము లక్ష్మణారావు(లచ్చన్న)ను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో అతడు నేరం అంగీకరించినట్టు తెలిపారు. నిందితుడిపై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. సున్నితమైన కేసును తక్కువ వ్యవధిలో చాకచక్యంగా చేధించిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details