ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిచ్చుకలంక వద్ద ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య - పిచ్చుకలంక వద్ద వ్యక్తి ఆత్మహత్య వార్తలు

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక శివారు పిచ్చుకలంక వద్ద ఒక యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 9న గడ్డివాము దగ్ధమైన ఘటనలో గాయాలైన వ్యక్తి మరణిస్తాడనే భయంతోనే.. బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని స్థానికులు తెలిపారు.

suicide
పిచ్చుకలంక వద్ద ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

By

Published : May 16, 2021, 10:06 PM IST


అగ్నిప్రమాదంలో గాయపడిన వ్యక్తి చనిపోతాడనే భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక శివారు పిచ్చుకలంక వద్ద జరిగింది. రంగంపేట మండలం జి.దొంతమూరు గ్రామానికి చెందిన పేపకాయల శ్రీను(27) , మేడిశెట్టి పాప రాజులు ఈ నెల 9వ తేదీన దొంతమూరు గ్రామానికి టాక్టర్​పై ఎండు గడ్డిని తీసుకుని వస్తున్నారు. గడ్డికి కరెంటు తీగలు తగలడంతో మంటలు వ్యాపించి గడ్డిపై కూర్చున్న పాపరాజుకు గాయాలయ్యాయి. బాధితుడిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతను చనిపోతాడనే భయంతో శ్రీను అక్కడినుంచి పిచ్చుకలంకకు వచ్చి వంతెన రైలింగ్​కు ఉరి వేసుకున్నాడు.

ABOUT THE AUTHOR

...view details