ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉపాధి హామీ పథకంలో పనివ్వలేదంటూ వాటర్​ ట్యాంక్​ ఎక్కిన వ్యక్తి - gokivada latest suicide news

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని కల్పించలేదంటూ మనస్థాపానికి గురైన వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. విషయం తెలుసుకున్న సచివాలయ అధికారులు ఘటనా స్థలానికి వచ్చి ఆ వ్యక్తికి నచ్చజెప్పి కిందికి దించారు.

man climbed water tank asked for work under nregs act in  gokavaram
మనస్థాపానికి గురై వ్యాటర్​ ట్యాంక్​ ఎక్కిన లోవరాజు

By

Published : Jul 2, 2020, 4:05 PM IST

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం గోకివాడ గ్రామానికి చెందిన లోవరాజు ఆత్మహత్యకు యత్నించాడు. ఉపాధి హామీ పథకం లబ్ధిదారుల జాబితాలో తనను చేర్చలేదని మనస్థాపంతో ఈ పనికి సిద్ధమయ్యాడు.

లోవరాజు ఈ ఉదయం గ్రామంలో ఉన్న వాటర్​ ట్యాంకు ఎక్కి హడావుడి చేశాడు. ఉపాధి హామీ పథకంలో తన పేరును చేర్చాలని లేకుంటే దూకేస్తానని బెదిరించాడు. విషయం తెలుసుకున్న గ్రామ సచివాలయ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. లోవరాజుతో మాట్లాడి... పని కల్పిస్తామని మాటిచ్చారు. వారి హామీతో శాంతించిన లోవరాజు కిందికి దిగాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details