ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Murder: ఆర్థిక లావాదేవీలతో వ్యక్తి దారుణ హత్య ! - ఆర్థిక లావాదేవీలతో వ్యక్తి దారుణ హత్య

తీసుకున్న అప్పు తిరిగి చెల్లించటం లేదని ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం యానంలో జరిగింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..హత్యకు గల కారణాలపై లోతుగా విచారిస్తున్నారు.

ఆర్థిక లావాదేవీలతో వ్యక్తి దారుణ హత్య
ఆర్థిక లావాదేవీలతో వ్యక్తి దారుణ హత్య

By

Published : Mar 12, 2022, 6:37 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం యానంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గోపాల్​నగర్ శివారులో నివసిస్తున్న మోకా వెంకటేశ్వరరావుపై ఓ అగంతకుడు కత్తితో దాడి చేశాడు. వెంకటేశ్వరరావుకు తీవ్ర గాయాలు కాగా.. కుటుంబసభ్యులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించనప్పటీ ఫలితం లేకుండా పోయింది.

విషయం తెలుసుకున్న పోలీసులు.. గంటల వ్యవధిలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతుడు అప్పు తీసుకొని చెల్లించటంలో జాప్యం చేస్తున్నాడని.., ఆర్థిక లావాదేవీల కారణంగానే కత్తితో దాడికి పాల్పడినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆసుపత్రిలో వెంకటేశ్వరరావు మృతదేహానికి శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ నివాళులర్పించారు.

ABOUT THE AUTHOR

...view details