తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామస్థులు ఇళ్ల స్థలాలు కోసం ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల స్థలాల పంపిణీలో భాగంగా.. ఊరికి దూరంగా స్థలాలు ఇవ్వడంతో లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. కొండల మధ్య, అడవిలో కాలవ పక్కన ఆ స్థలాలు ఉన్నాయని ఆరోపించారు. అధికారులు స్పందించి ఆ స్థలాలను రద్దు చేసి ఊరికి దగ్గరగా ఇవ్వాలని కోరారు.
ఊరికి దగ్గరగా ఇళ్ల స్థలాలు ఇవ్వండి సార్! - ఇళ్ల స్థలాల పంపిణీ తాజా వార్తలు
ఇళ్ల స్థలాల కోసం తూర్పుగోదావరి జిల్లా మల్లిసాల గ్రామస్థులు ఆందోళన చేశారు. తమకు పంపిణీ చేస్తున్న స్థలాలు గ్రామానికి దూరంగా ఉన్నాయని.. నివాసయోగ్య ప్రాంతంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Mallisala villagers agitated for distribution of houses in East Godavari district