ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యానాం శాసనసభ సభ్యత్వానికి మల్లాడి కృష్ణారావు రాజీనామా - యానం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు రాజీనామా వార్తలు

కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కొన్ని రోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

యానం శాసనసభ సభ్యత్వానికి మల్లాడి కృష్ణారావు రాజీనామా
యానం శాసనసభ సభ్యత్వానికి మల్లాడి కృష్ణారావు రాజీనామా

By

Published : Feb 15, 2021, 8:11 PM IST

యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపారు. తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ ఫార్మాట్​లో పంపించినట్లు తెలియజేశారు. చాలా రోజుల నుంచి అధికారిక కార్యక్రమాలకు మల్లాడి దూరంగానే ఉన్నారు. యానాం ప్రాంతానికి సంబంధించిన సమస్యలపై ఇటీవల రాష్ట్రపతిని కలిసి వినతిపత్రాన్ని కూడా సమర్పించారు.

యానాం రాజకీయాలలో సంచలనం..

1996 నుంచి 2016 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో యానాం నియోజకవర్గం నుంచి ఓటమి ఎరుగని నాయకుడిగా విజయం సాధిస్తూ వచ్చారు మల్లాడి కృష్ణారావు. నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ.. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా యానాం సమస్యల పరిష్కారం కోసం అటు కేంద్రంతోనూ... రాష్ట్రంలో నాయకులతోనూ సఖ్యతగా మెలగడం ద్వారా పనులు సాధించుకోవడంలో ఆయన అందెవేసిన చేయి.

ఇదీ చదవండి:రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details