హాథ్రస్ హత్యాచార ఘటనలో నిందితులను ఉరితీయాలని మాల మహానాడు తూర్పుగోదావరి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కాకినాడ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసి అర్ధరాత్రి మృతదేహాన్ని కాల్చేసిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు నక్కా చిట్టిబాబు డిమాండ్ చేశారు.
దోషులను కఠినంగా శిక్షించాలన్న ఆయన.. దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలన్నారు. దళిత మహిళపై అత్యంత పాశవికంగా జరిగిన ఘటనకు యూపీ సీఎం యోగి అధిత్యనాథ్ నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.