ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హక్కుల కోసం అంతా ఏకం కావాలని మాలల మహాసభ పిలుపు - మాల యుద్ధభేరి మహాసభ వార్తలు

తూర్పుగోదావరి జిల్లాలో తెలుగు రాష్ట్రాల మాల యుద్ధభేరి మహాసభ నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వాలు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని పలువురు నాయకులు ఆరోపించారు.

mala mahanadu at kakinada
కాకినాడలో మాల యుద్ధభేరి మహాసభ

By

Published : Mar 2, 2020, 12:03 PM IST

కాకినాడలో మాల యుద్ధభేరి మహాసభ

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ఆనందభారతి ప్రాంగణంలో తెలుగు రాష్ట్రాల మాల యుద్ధభేరి మహాసభను నిర్వహించారు. అంటరానితనం అమానుషం అని తెలిసినా ప్రభుత్వం, అధికారులు తమను దూరం పెట్టి మానసికంగా హింసిస్తున్నారని పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.ఏ రాజకీయ నాయకుడు గద్దెనెక్కినా... మాలలకు అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. జై భీమ్ అనే నినాదంతో అంతా ఏకమై రాజ్యాంగ హక్కులను సాధించుకోవాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. అంబేద్కర్ మాలల కోసం రాసిన రాజ్యాంగాన్ని ఆయా రాజకీయ పార్టీలు సొంత మనుగడకు వాడుకుంటున్నాయని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలకు కనీస సౌకర్యాలు, భద్రత కల్పించకుండా ప్రభుత్వాలు చులకన భావంతో చూస్తున్నాయన్నారు.

ఇదీ చదవండి:ఇరువర్గాల మధ్య వివాదం... కేసు నమోదు చేసిన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details