ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాపూ గారి బొమ్మ...అదిరిందండి..!

మహాత్ముడి జయంతి సందర్భంగా ఆయనపై అభిమానాన్ని చాటుకున్నారు కొందరు కళాకారులు. వివిధ రూపాల్లో బాపూ పత్రిమలు, చిత్రాలు రూపొందించారు.

బాపూ గారి బొమ్మ...అదిరిందండి..!
బాపూ గారి బొమ్మ...అదిరిందండి..!

By

Published : Oct 2, 2020, 4:41 AM IST

Updated : Oct 2, 2020, 7:07 AM IST

మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా చిత్రకారులు ఆయనకు వినూత్న రీతిలో నివాళి అర్పిస్తున్నారు. గుంటూరు జిల్లా పెదరావూరుకు చెందిన ఉపాధ్యాయుడు వెంకటకృష్ణ గాంధీ చిత్తరువుని ఆకుపై చిత్రించారు. కదంబం చెట్టు నుంచి ఆకు సేకరించి, దానిపై బాపు చిత్రాన్ని రూపొందించారు.

బియ్యపు గింజలతో బాపూ చిత్రం

తూర్పుగోదావరి జిల్లా రంగపేటకు చెందిన సైకత శిల్పి దేవిని శ్రీనివాస్‌ సబ్బుపైన మహాత్ముని ఆకృతిని తీర్చిదిద్దారు. సుమారు నాలుగు గంటలపాటు శ్రమించి కళాకృతిని రూపొందించారు. పి.గన్నవరానికి చెందిన పేరిచర్ల సత్యవాణి అనే గృహిణి బియ్యపు గింజలతో బాపూ చిత్రాన్ని తీర్చిదిద్దారు.

ఆకుపై గాంధీ చిత్రం
సబ్బుతో మహాత్ముని ఆకృతి

ఇదీ చదవండి :ఐసీసీ ట్విట్టర్​ పేజీలో.. ఆంధ్రా చిన్నారుల ఆట!

Last Updated : Oct 2, 2020, 7:07 AM IST

ABOUT THE AUTHOR

...view details