ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కైలాసవాసుడిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు - mahashivaratri celebrations in amalapuram

తూర్పు గోదావరి జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుపుకొంటున్నారు. కైలాసవాసుడిని దర్శించుకునేందుకు భక్తులు వేకువజామునే ఆలయాల వద్ద బారులు తీరారు. ద్రాక్షారామంలోని శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారిని మంత్రి పినిపే విశ్వరూప్ సతీ సమేతంగా దర్శించుకున్నారు.

mahashivaratri celebrations in east godavari district
కైలాసవాసుడిని దర్శించుకునేందుకు పోటేత్తిన భక్తులు

By

Published : Mar 11, 2021, 4:22 PM IST

మహాశివరాత్రి సందర్భంగా దేవాలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని ఆలయాల్లో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.

ద్రాక్షారామంలో మంత్రి పూజలు..

మహాశివరాత్రిని పురస్కరించుకొని ద్రాక్షారామంలోని శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారిని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వాగతం పలికి... స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి తీర్థప్రసాదాలను అందించారు.

ఏడాదికి ఒక్కసారే దర్శనం..

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బిక్కవోలులోని ప్రాచీన కేదారేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ప్రతి ఏటా మహాశివరాత్రికి మాత్రమే దర్శనమిచ్చే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. తెల్లవారు జామునుంచే ఆలయంలో ప్రత్యేకపూజలు చేశారు.

బ్రహ్మ కుమారీల మెడిటేషన్​..

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అమలాపురంలో వందల సంఖ్యలో బ్రహ్మ కుమారీలు పరమశివుని ఆరాధిస్తూ మెడిటేషన్ చేశారు. మనసులో పరమశివుని ఆరాధిస్తూ ధ్యానముద్రలో ఉండిపోయారు.

ఇదీ చదవండి

శివనామస్మరణతో మార్మోగుతున్న శివాలయాలు

ABOUT THE AUTHOR

...view details