తూర్పుగోదావరి జిల్లా ర్యాలీకి చెందిన ఉపాధ్యాయుడు, ఇంద్రజాలికుడు అయిన శ్యామ్ జాదూగర్ పిచ్చుకలకు వినూత్న రీతిలో ఆహారం అందిస్తున్నారు. కొత్తగా వచ్చిన వరి కంకులను సేకరించి వాటిని బుట్టలుగా పేర్చి పిచ్చుకలు తినేలా రూపొందించారు. వాటిని దేవాలయం, మసీదు, చర్చిలతోపాటు వివిధ చోట్ల వేలాడదీస్తున్నారు. అన్ని మతాలు, గ్రంథాల సారం ఒక్కటేనని, పశు పక్షాదులకు ఆహారం, నీరు అందించాలని ఆయన అన్నారు. అంతరించి పోతున్న పిచ్చుకలను కాపాడుకునేందుకు వివిధ చోట్ల వరి కంకులు ఉంచుతున్నామని తెలిపారు. శ్యామ్ జాదూగర్ కుటుంబం ఇంద్రజాలంతోపాటు పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.
వరి కంకులను పేర్చి.. పిచ్చుకల ఆకలి తీర్చే - east godavari latest news
కుంటుంబ సభ్యులంతా వృత్తి రీత్య ఇంద్రజాలికులు. కానీ ఆయన విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేశారు. పక్షులంటే ఎనలేని ప్రేమ. కానీ అవి అంతరించి పోతుండటం బాధ కలిగించింది. అందరిలాగా చూస్తూ ఊరుకోలేదు. పక్షులను కాపాడటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. అందులో ఈ వినూత్న పద్ధతి ఆయన మంచి మనసుకు అద్దం పట్టింది.
పిచ్చుకల ఆకలి తీర్చే