రాజమహేంద్రవరం ఎంపీగా తనను గెలిపిస్తే..... ప్రజలకు మెరుగైన సేవలు చేస్తామని తెదేపా అభ్యర్థి మాగంటి రూప చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కారణంగానే... తన ప్రచారానికి ఇంతటి ఆదరణ లభిస్తోందని ఆమె పేర్కొన్నారు. అడుగడుగునా పెద్ద సంఖ్యలో మహిళలు మాగంటి రూపకు ఘన స్వాగతం పలికారు. 12 అంశాలతో రాజమహేంద్రవరం మేనిఫోస్టేను ఆమె విడుదల చేశారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిని మల్టీ స్పెషాలిటీ స్థాయికి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర సహకారం లేకపోవడంవల్లే మోరంపూడి పై వంతెన నిర్మాణం జరగలేదని ఆమె చెప్పారు. ప్రతి ఆరు నెలలకు ప్రజాప్రగతి నివేదిక అందిస్తామని తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో మాగంటి రూప జోరు - tdp
రాజమహేంద్రవరం పార్లమెంట్ తెదేపా అభ్యర్థి మాగంటి రూప ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. 12 అంశాలతో మేనిఫేస్టోను రూపొందించి...పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన మాగంటి రూప