ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాగంటి రూప వాహనాన్ని అడ్డుకున్న జనసేన కార్యకర్తలు

రాష్ట్రంలో చాలా చోట్ల పోలింగ్ కేంద్రాల్లో అలజడి రేగుతోంది. తూర్పు గోదావరి జిల్లా కొంతమూరులో తెదేపా కార్యకర్తల దాడిని నిరసిస్తూ మాగంటి రూప కారును జనసేన కార్యకర్తలు అడ్డుకున్నారు.

మాగంటి రూప వాహనాన్ని అడ్డుకున్న జనసేన కార్యకర్తలు

By

Published : Apr 11, 2019, 4:03 PM IST

Updated : Apr 11, 2019, 4:20 PM IST

మాగంటి రూప కారును అడ్డుకున్న జనసేన కార్యకర్తలు

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గంలోని కొంతమూరులోని పోలింగ్ కేంద్రాల వద్ద జనసేన, తెదేపా నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎంపీ అభ్యర్థి మాగంటి రూప అనుచరులు పదిమంది పోలింగ్ బూత్ లోపలకు రావడంతో వారిని జనసేన కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎక్కువ మంది లోపలకు రాకూడదని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆగ్రహించిన మాగంటి రూప అనుచరుడు జనసేన కార్యకర్తపై చేయి చేసుకున్నాడు. దీంతో మిగిలిన జనసేన కార్యకర్తలు.... మాగంటి రూప కారును అడ్డుకున్నారు. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది.

Last Updated : Apr 11, 2019, 4:20 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details