శుభకార్యానికి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం.. ఒకరిని బలి తీసుకుంది. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మడికి ప్రాంతంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా మామిడూరు గ్రామానికి చెందిన చురుమూరి రామస్వామి సూర్య, పార్వతి, సురేష్, సునిత, కారుణ్య, రమ్య.. కారులో ప్రయాణిస్తున్నారు. మడికి పెట్రోల్ బంక్ సమీపంలోకి వచ్చేసరికి ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రామస్వామి అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న హైవే సిబ్బంది క్షతగాత్రులను అంబులెన్స్‌లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
జాతీయ రహదారిపై ప్రమాదం.. ఒకరి మృతి, ఐదుగురికి గాయాలు - మడికి జాతీయ రహదారిపై
తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం మడికి ప్రాంతంలోని జాతీయ రహదారిపై.. ప్రమాదం జరిగింది. ఒకరు మృతి చెందగా..ఐదుగురికి గాయలయ్యాయి.
శుభాకార్యనికి వెళ్లి..ఒకరు మృతి..ఐదుగురికి గాయలు