లూథరిన్ పాఠశాలలో పూర్వవిద్యార్థుల సమ్మేళనం - లూథరిన్ పాఠశాలలో పూర్వవిద్యార్థుల సమ్మేళనం
తూర్పుగోదావరి జిల్లాలోని లూథరిన్ పాఠశాలలో 1969 సంవత్సర పదో తరగతి విద్యార్థులు... పూర్వవిద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. సుమారు 50 ఏళ్ల తరువాత కలుసుకోవటం చాలా ఆనందంగా ఉందని విద్యార్థులు తెలిపారు.

లూథరిన్ పాఠశాలలో పూర్వవిద్యార్థుల సమ్మేళనం
లూథరిన్ పాఠశాలలో పూర్వవిద్యార్థుల సమ్మేళనం
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని లూథరిన్ ఉన్నత పాఠశాలలో పూర్వవిద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. 1969లో పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు... ఆనాటి స్నేహం -ఈనాటి కలయిక పేరుతో స్వర్ణోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. వారంతా కలిసి మధుర స్మృతులను నెమరువేసుకున్నారు. అనంతరం గురువులను ఘనంగా సన్మానించారు. 50 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులతో... సన్మానం పొందడం చాలా సంతోషంగా ఉందని ఉపాధ్యాయుడు గ్యాబ్రియల్ తన ఆనందాన్ని పంచుకున్నారు.