ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ పనికి నాసిరకం​ ఇసుక సరఫరా.. తిప్పి పంపిన అధికారులు - low quality sand Supply latest news

ఆన్​లైన్​లో బుక్ చేసుకుంటే నాణ్యమైన ఇసుకను ఇంటి వద్దకే పంపిస్తామని ప్రభుత్వం చెబుతున్న మాటలు.. చేతలకు నోచుకోవడం లేదు. అధికారులు ప్రభుత్వ పనుల కోసం బుక్ చేయగా... మట్టితో కూడిన నాసిరకం ఇసుకను పంపించిన సంఘటన తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో వెలుగు చూడడం.. ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

low quality sand Supply on online
ఆన్​లైన్​లో నాసిరకం​ ఇసుక సరఫరా

By

Published : Jun 7, 2020, 7:04 PM IST

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం కొమర్రాజులంక ప్రాథమికోన్నత పాఠశాలలో.. నాడు - నేడు పనులను అధికారులు చేపట్టారు. సమగ్ర శిక్ష అభియాన్ అధికారులు ఇసుక కోసం ఆన్​లైన్​లో బుక్ చేశారు. 30 టన్నుల ఇసుకను బుక్ చేయగా జొన్నలంక ర్యాంపు నుంచి మూడు లారీల్లో తీసుకొచ్చారు.

మట్టితో కూడిన నాసిరకం ఇసుక రావడంపై అధికారులు ఆశ్చర్యపోయారు. స్థానికులు మరో 2 లారీల్లో ఇసుకను పరీక్షించగా.. అందులోనూ అదేవిధంగా ఉండటంతో ఇసుక దిగుమతి చేయడం కుదరదని వెనక్కి పంపించారు. ఇదే అంశంపై సమగ్ర శిక్ష అభియాన్ జేఈ రాంజీని ఈటీవీ భారత్ వివరణ కోరగా నాసిరకం ఇసుక రావడం వాస్తవమేనని.. తిప్పి పంచామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details