పెద్దల నుంచి తమకు ప్రాణభయం ఉందని.. తమ కులాంతర వివాహాన్ని వ్యతిరేకిస్తున్నవాళ్లు హాని చేసే అవకాశం ఉందని రక్షణ కల్పించాలని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ ప్రేమజంట కోరింది. కాకినాడలోని జిల్లా పోలీసు కార్యాలయాన్ని ఆశ్రయించి వినతిపత్రం అందజేశారు. గొల్లప్రోలు మండలం మార్కండేయపురం గ్రామానికి చెందిన వేరువేరు సామాజికవర్గాలకు చెందిన ఇద్దరు విశాఖ అనకాపల్లి వద్ద ఉన్న నూకాలమ్మతల్లి ఆలయంలో వివాహం చేసుకున్నారు. అమ్మాయి కుటుంబం తమను వెంటాడుతున్నారని... స్నేహితులను, ఇంట్లో వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాలు ఆరోపించారు. ఎస్పీని కలిసి తమకు రక్షణ కల్పించాలని కోరడానికి కాకినాడ వచ్చినట్లు వివరించారు.
పెళ్లైతే చేసుకున్నాం...ప్రాణాలు మీరే కాపాడాలి! - taja news of love marriage in east godavari dst
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు ప్రేమికులు పెద్దలను ఎదిరించి కులాంతర వివాహం చేసుకున్నారు. అమ్మాయి తరుపు బంధువులు తమను చంపుతామంటూ బెదిరిస్తున్నారని ప్రాణరక్షణ కల్పించాలంటూ జిల్లా ఎస్పీని ఆశ్రయించారు.
lovers approach kakinada sp from thrat of girl side family members due to they did intercast marriage
TAGGED:
east godavari dst taja news