మహాదేవుడి రూపం
కార్తిక పౌర్ణమిని పురస్కరించుకొని.. ఓ కళాకారుడు సబ్బుపై పరమ శివుడి రూపాన్ని రూపొందించాడు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన దేవిన శ్రీనివాస్.. ఇందుకోసం సుమారు 3 గంటల పాటు శ్రమించాడు. 100 గ్రాముల సబ్బుపై.. శివలింగం, సర్పం, త్రిశూలంతో కూడిన మహాదేవుడిని నెలకొల్పాడు.