ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోటపాడు శ్మశానంలో శివుని విగ్రహ ప్రతిష్ఠ.. ఉద్రిక్తత - కోటపాడు శశ్మాన వాటికలో శివుని విగ్రహం

SHIVA STATUE ISSUE: శ్మశాన వాటికలో శివుని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. ఓ వర్గం శివుడి విగ్రహం ఏర్పాటు చేస్తుండగా మరో వర్గం విగ్రహం ఏర్పాటు తమకు అరిష్టమని అడ్డుకుంది. దీంతో రెండు వర్గాల మధ్య వివాదం జరిగింది.

SHIVA STATUE ISSUE
SHIVA STATUE ISSUE

By

Published : Jan 30, 2023, 2:59 PM IST

SHIVA STATUE ISSUE : తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం కోటపాడులోని శ్మశానవాటికలో ఉద్రిక్తత నడుమ శివుని విగ్రహం ప్రతిష్ఠించారు. ఈ నెల 28న ఓ వర్గం శివుడి విగ్రహం ఏర్పాటు చేస్తుండగా మరో వర్గం విగ్రహం ఏర్పాటు తమకు అరిష్టమని అడ్డుకుంది. దీంతో రెండు వర్గాల మధ్య వివాదం జరిగింది. ఓ వర్గం శ్మశానం వద్ద బైఠాయించి నిరసన తెలపగా.. మరో వర్గం రెవెన్యూ కార్యాలయం వద్ద శివుని విగ్రహంతో నిరసనకు దిగారు.

కోటపాడులో 144 సెక్షన్.. పోలీసు బందోబస్తు మధ్య శశ్మానంలో శివుని విగ్రహ ప్రతిష్ఠ

"కోటపాడు గ్రామానికి సంబంధించిన హిందూవులు తమ శ్మశానంలో శివుని విగ్రహం పెట్టుకోవడానికి శనివారం ప్రతిష్ఠ చేయాలని నిర్ణయించుకుని ఆ శివుని విగ్రహం కొంటుంటే.. కొంతమంది దానివల్ల తమకు నష్టం, అరిష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ఇరు వర్గాల వాళ్లు కలిసి రంగంపేట తహశీల్దారు ఆఫీసుకు వెళ్లారు. నిన్న తహశీల్దారు.. శ్మశానంలో శివుని విగ్రహం పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చారు. దాంతో ఈరోజు శివుని విగ్రహం ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠను అడ్డుకోవాలని చూసిన వారిని అదుపులోకి తీసుకున్నాం" -పోలీసులు

దీంతో రెవెన్యూ అధికారులు పోలీసులు రెండు వర్గాల పెద్దలను ఒప్పించి ఎట్టకేలకే శివుని విగ్రహం ప్రతిష్టించారు. అయితే విగ్రహ ప్రతిష్ఠ అడ్డుకునేందుకు ఓ వర్గం ప్రయత్నించగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరో నాలుగు రోజులపాటు గ్రామంలో 144 సెక్షన్ విధించినట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details