తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో గణేష్ నిమజ్జన ఊరేగింపులు ఘనంగా జరిగాయి. తొమ్మిది రోజుల పాటు పూజించిన బొజ్జ గణపయ్య విగ్రహాలను అందంగా అలంకరించి వాహనాల్లో ఊరేగింపుగా నిమజ్జనానికి తీసుకెళ్లారు. చిన్నారులు, యువత, పెద్దలు అంతా రంగులు పులుముకుని నృత్యాలు చేస్తూ సందడి చేశారు. గోదావరి నది పాయలు, చెరువుల్లో గణనాథులను ఘనంగా నిమజ్జనం చేశారు.
ఘనంగా గణనాథుని నిమజ్జనం.. - వినాయక నిమర్జనం
వినాయక చవతి నవరాత్రి ఉత్సవాలు పూర్తవటంతో గణనాథుని నిమజ్జనాలు మొదలవటంతో తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో ఉత్సాహంగా నిమజ్జన కార్యక్రమం సాగింది.
ఘనంగా గణనాథుని నిమర్జనం