ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 14, 2019, 7:27 PM IST

ETV Bharat / state

అప్పటివరకు మా పోరాటం ఆగదు: నారా లోకేశ్​

ప్రభుత్వం ఇసుక విధానం ప్రవేశపెట్టే వరకు తెదేపా పోరాటం ఆగదని తెదేపా ముఖ్యనేత లోకేశ్​ స్పష్టం చేశారు. ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

ఇసుక సమస్యపై లోకేశ్

నారా లోకేశ్​

చంద్రబాబు దీక్షను చూసే ప్రభుత్వం ఇసుక వారోత్సవాలు ప్రకటించిందని... తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ పేర్కొన్నారు. ఉచిత ఇసుక విధానం అమలయ్యే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని లోకేశ్‌ డిమాండ్​ చేశారు. ఇప్పటివరకు 46 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల కుటుంబాలకు నెలకు రూ.10 వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులు ఆత్మహత్య చేసుకుంటుంటే... మంత్రులు ఎగతాళి చేస్తున్నారని ధ్వజమెత్తారు. కార్మికుల తరఫున మాట్లాడితే... కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details