తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ఉదయం ఆరుగంటలకే అన్ని దుకాణాలు తెరిచారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అమలాపురం ఆర్డీవో భవాని శంకర్ కొత్త నిబంధనలు అమలు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. అన్ని ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే వ్యాపార సంస్థలు తెరుచుకుని వ్యాపారం చేసుకోవాలని, అనంతరం మూసి వేయాలని నిర్ణయించారు. మంగళవారం నుంచే ఈ నిబంధనలకు అమల్లోకి వచ్చాయి.
ఆరుగంటలకే తెరుచుకున్న దుకాణాలు... - lock down in east godavari dst
తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో లాక్డౌన్ నిబంధనలకున అనుగుణంగా దుకాణాలను ఉదయం ఆరు గంటలకే తెరిచారు. ఆర్డీవో ఆదేశాల మేరకు వ్యాపారులు తమ దుకాణాలను ఉదయం 11 గంటలకు మూసివేస్తున్నారు.
![ఆరుగంటలకే తెరుచుకున్న దుకాణాలు... lockdown rules are following in east godavari dst konasima](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8018214-148-8018214-1594708278895.jpg)
lockdown rules are following in east godavari dst konasima