ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాక్​డౌన్​ ఎఫెక్ట్​ : పురపాలక సంఘాల ఆదాయానికి గండి - Municipalities Revenue down news

కరోనా వైరస్ వ్యాప్తితో ప్రభుత్వం లాక్​డౌన్ ప్రకటించడం వల్ల వ్యాపారాలు లేక దుకాణదారులు అగచాట్లు పడుతున్నారు. దీంతో పురపాలక సంఘం ఆదాయానికి కొంతమేర గండిపడింది. పలు పురపాలక సంఘాల పరిధిలోని దుకాణాలకు మూడు నెలలపాటు అద్దె చెల్లించలేమంటు దుకాణదారులు వాపోతున్నారు.

Lockdown Effect Municipalities Revenue down
పురపాలక సంఘాల ఆదాయానికి గండి

By

Published : May 31, 2020, 6:36 PM IST

లాక్​డౌన్​ కారణంగా పలు పురపాలక సంఘాలకు అద్దె బకాయిలు పేరుకుపోయాయి. గడిచిన మూడు నెలల పాటు అద్దె చెల్లించలేమని దుకాణాదారులు చేతులెత్తేశారు. తూర్పుగోదావరి జిల్లా తుని పురపాలక సంఘ పరిధిలో 606 దుకాణాలు ఉండగా నెలకు అద్దెల రూపంలో రూ. 10 లక్షలు రావాల్సి ఉంది.

అయితే లాక్ డౌన్ కారణంగా దుకాణాలు తెరుచుకోనందున.. దుకాణాదారులు అద్దె చెల్లించలేకపోయారు. పురపాలక సంఘం ఆదాయానికి గండి పడింది. వ్యాపారాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, మూడు నెలల అద్దెలు రద్దు చేయాలని పురపాలక దుకాణాల్లో అద్దెకు ఉంటున్నవారు కోరుతున్నారు. వ్యాపారుల నుంచి వినతులు వస్తే ప్రభుత్వానికి నివేదించి ఆదేశాలను అనుసరించి వ్యవహరిస్తామని పురపాలక కమిషనర్ ప్రసాదరాజు తెలిపారు.

ఇవీ చూడండి...

గొల్లల మామిడాడలో కొత్తగా 16 కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details