'నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు' - lockdown action by amalapuram rdo
తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఉదయం పదిన్నర తర్వాత రోడ్డు మీద తిరిగితే చర్యలు తీసుకుంటున్నారు.
తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఉదయం పదిన్నర తర్వాత రోడ్డు మీద తిరుగుతున్న ఏడుగురి పై అమలాపురం ఆర్డీవో భవానీశంకర్ చర్యలు తీసుకున్నారు. వారిని అమలాపురం సమీపంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలించారు. ఇష్టానుసారం రహదారుల మీద తిరిగితే వారిని క్వారంటైన్‌కు తరలిస్తామని అధికారులు ముందుగానే హెచ్చరించినా... కొందరు బేఖాతరు చేయడంతో అధికారులు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆర్డీఓ భవానిశంకర్ హెచ్చరించారు.