పశ్చిమగోదావరి జిల్లాలో పోలీసులు లాక్డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్నారు. రెడ్జోన్లలో నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఆచంట మండలం రెడ్‌జోన్ అయినప్పటికీ పలువురు వాహనదారులు అనవసరంగా రోడ్లపైకి వచ్చారు. అలాంటివారికి గుంజీళ్లు తీయించి ఎస్ఐ సీహెచ్.రాజశేఖర్ వినూత్న రీతిలో గుణపాఠం చెప్పారు. అనంతరం వారందరికీ కరోనా వ్యాధిపై అవగాహన కల్పించారు. మరోసారి ఇలా రోడ్లపైకి వస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని.. నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు.
అనవసరంగా బయటకు వచ్చారు.. గుంజీళ్లు తీశారు.. - west godavari red zones latest news
పశ్చిమగోదావరి జిల్లాలో రెడ్‌జోన్ ప్రాంతాల్లో పోలీసులు లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారితో గుంజీళ్లు తీయిస్తున్నారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
ఆచంటలో గుంజీళ్లు తీయించిన పోలీసులు