తూర్పు గోదావరి జిల్లా తునిలో లాక్ డౌన్‌ను అధికారులు మరింత పకడ్బందీగా అమలు చేస్తున్నారు. విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన వ్యక్తికి కరోనా సోకిన పరిస్థితుల్లో.. తుని అధికారులు అప్రమత్తమయ్యారు. తుని - పాయకరావుపేటకు మధ్య రాకపోకలు నిలిపివేశారు. బారికేడ్లు ఏర్పాటుచేసి పోలీసులు పహారా కాస్తున్నారు. ఉప్పరిగూడెం ప్రాంతవాసులు తమ గ్రామంలోకి ఎవ్వరూ రాకుండా కంచె ఏర్పాటు చేశారు.
తునిలో లాక్డౌన్ మరింత కఠినం - తూర్పుగోదావరిలో లాక్డౌన్ వార్తలు
తూర్పు గోదావరి జిల్లా తునిలో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు అధికారులు. తుని - పాయకరావుపేట రహదారిలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇళ్ల నుంచి ఎవ్వరూ బయటకు రావొద్దంటూ సూచనలు చేస్తున్నారు.

తునిలో కఠినంగా లాక్డౌన్ అమలు